జెనీలియా రీఎంట్రీ ఇస్తుందట!

15:03 - December 3, 2018

కళ్లతోనే మాట్లాడగలిగే కథానాయికగా పేరు తెచ్చుకున్న జెనీలియా, వివాహం తరువాత నటనకు దూరమైంది.  ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా .. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టింది. ఇటీవలే 'మౌలి' అనే మరాఠీ సినిమాలో తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి ఒక సాంగ్ లో మెరిసింది. తన స్థాయికి తగిన సినిమాలు వస్తే దక్షిణాదిలోను సినిమాలు చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ ఆమె ఇటీవల ఒక స్టేజ్ పై చెప్పింది.  'బొమ్మరిల్లు' సినిమాతో జెనీలియా యూత్ హృదయాలను .. ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను ఏకమొత్తంగా దోచేసింది. తెలుగు తెరపై అందమైన కథానాయిక అనిపించుకున్నవాళ్లు చాలామందే వున్నారు. కానీ అల్లరి కథానాయిక అనిపించుకున్నది మాత్రం జెనీలియానే.