జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఆసక్తికర విషియాలు చెప్పిన లక్ష్మీ పార్వతి

11:51 - December 18, 2018

నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీ పార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు అతడి తల్లిని తమ పెళ్లి అయిన తర్వాత నేను చెబితే ఇంటికి పిలిపించాడని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. తాను చెప్పడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను ఇంటికి పిలిపించారని ఎంతైనా మన మనవడే కదా అంటూ నేను స్వయంగా పిలిపించి మరీ అతడికి లిఫ్ట్ ఇచ్చాను అన్నారు. ఆ రోజుల్లో నేను ఎన్టీఆర్ కు చాలా సాయం చేశాను అంది. త్యాగరాజ గాన సభల్లో నేనే ఆ అబ్బాయికి మొదట అరంగేట్రం చేయించాను. ఆ తర్వాత కూడా నేను అతడికి చాలా సాయం చేశాను. కానీ ఎన్టీఆర్‌ మాత్రం అవన్నీ మరిచిపోయారని అన్నారు. ఎందుకంటే...మొదటి సారి ఇంటికి వచ్చిన సమయంలో నాకు ఆయనకు మద్యలో నిల్చుని జూనియర్ ఎన్టీఆర్ ఫొటో దిగాడని మా ప్రభుత్వం పడిపోయాక ఎన్టీఆర్ ఆ ఫొటోల్లోంచి నన్ను తీసేసి తాతతో ఉన్న ఫొటోను మాత్రమే పెట్టుకున్నాడని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చింది. ఎవరైనా వైభవంగా ఉన్న సమయంలోనే దగ్గరగా ఉంటారు. ఎప్పుడైతే ఆ వైభవంను కోల్పోతారో అంతా కూడా దూరం అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబంకు చెందిన వాడే కాబట్టి అతడు కూడా నన్ను దూరం పెట్టాడు అంటూ లక్ష్మీ పార్వతి వాపోయింది. ఒక వేళ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని టేకోవర్ చేస్తే మీరు మద్దతు తెలుపుతారా అంటూ ప్రశ్నించగా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని సమాధానం ఇచ్చింది.