జాన్వీ కపూర్‌ మెచ్చిన దేవరకొండ

13:16 - November 26, 2018

విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు ఎంత క్రేజున్న హీరోనో చెప్పే పనిలేదు. అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం లాంటి హిట్‌ కొట్టిన దేవరకొండ, సినిమాల్లో యావరేజ్‌ కంటెంట్‌ వున్నప్పటికీ తనదైన శైలిలో కలెక్షన్స్‌ రాబడుతున్నాడు. తాజాగా వచ్చిన టాక్సీవాలా కూడ దుమ్ములేపుతుంది. ఈ క్రేజ్ మేనియా అంతా మనకే పరిమితం అనుకుంటే పొరపాటు. మనోడికి నార్త్ లో కూడా భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరో అయితే పర్వాలేదు ఏకంగా అతిలోకసుందరి తనయ జాన్వీ కపూర్ మనసును కూడా గెలుచుకున్నాడు.  ఇటీవలే కాఫీ విత్ కరన్ షోలో అన్నయ్య అర్జున్ కపూర్ తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్ ని యాంకర్ కరన్ జోహార్ ఓ ప్రశ్న వేసాడు. ఒకవేళ ఉదయాన్నే లేచినప్పుడు అబ్బాయిగా మారిపోవాల్సి వస్తే ఎవరిలా ఉండాలని కోరుకుంటావు అని అడిగాడు. అంతే వెంటనే తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. అంతే కాదు త్వరలో సినిమా చేయాలనే కోరిక కూడా ఉందట.  పక్కనే ఉన్న అన్నయ్యలా కాకుండా లేక బాలీవుడ్ లో స్టార్స్ గా వెళ్లిపోతున్న వాళ్ళను కాకుండా సౌత్ లో ఓ అప్ కమింగ్ హీరో పేరు చెప్పిందంటే మాటలా. జాన్వీ కపూర్ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంది కానీ మనసులోనే దాచుకున్న అమ్మాయిలు ఎన్ని లక్షల్లో ఉన్నారో. చిరంజీవి అన్నట్టు విజయ్ దేవరకొండ యాక్టర్ నుంచి స్టార్ గా ఎదిగిపోయాడు అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో.