జయసుధ పాత్రలో ఆరెక్స్‌ బ్యూటీ

12:31 - November 25, 2018

విశ్వసనీయ సమాచారం మేరకు ' ఆరెక్స్‌100 ' సినిమాలోని బ్యూటీ పాయల్‌ రాజ్‌ పూత్‌ ఇప్పుడు ఒక ప్రముఖ నటి పాత్రలో నటించబోతుంది. సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడు, తెలుగు ప్రజానీకానికి అభిమానపాత్రుడైన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా '  ఎన్టీఆర్ ' లో ఒక స్పెషల్ క్యామియోకు సైన్ చేసినట్టు తెలిసింది.  ఆ పాత్ర ఎవరిదో కాదు సహజనటి జయసుధది. ఇప్పటికే పలు పాత్రల కోసం రకుల్ ప్రీత్, విద్యాబాలన్, రానా, సుమంత్ లాంటి భారీ తారాగణం ఎంపిక చేసిన క్రిష్.. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్‌ని కూడా ఈ ప్రాజెక్ట్ లోకి లాగేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.అప్పట్లో ఎన్టీఆర్‌తో కలిసి డ్రైవర్ రాముడు, కేడీ నెంబర్, గజదొంగ, సరదా రాముడు, లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో చిందులేసింది జయసుధ. దీంతో ఈమె క్యారెక్టర్ కోసం పాయల్ అయితే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన క్రిష్ వెంటనే ఆమెను ఒకే చేశాడని ఫిలింనగర్ వార్త.