జనసేనా జోష్యం చెప్పిన శ్రీరెడ్డి

14:39 - September 15, 2018

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం నటి శ్రీరెడ్డికి మామూలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్నట్లుగా తెర మీదకు వచ్చిన ఆమె.. తర్వాతి కాలంలో ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. అయితే ఇప్పుడామె ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాకు ఎన్ని సీట్లోస్తాయో అనే దానిపై జ్యోష్యం చెప్పారు.

తాజాగా హైదరాబాద్ లో ఒక బేకరీని ఓపెన్ చేయటానికి వచ్చిన ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరే తాజా సందర్భంలోనూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్న ఆమె.. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ జనసేనకు ఘోర పరాజయం తప్పదన్నారు. కేవలం మూడు.. లేదంటే నాలుగు సీట్లలో మాత్రమే పవన్ పార్టీ గెలుస్తుందని.. మిగిలినచోట్ల ఓడిపోవటం ఖాయమన్నారు. రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తి లేదంటూనే..జనసేనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏముందో...రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.