జక్కన్న మల్టీ స్టారర్‌ మూవీలో మరో మ్యాజిక్‌ డేట్‌..!

11:30 - November 30, 2018

రాజమౌళీ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో మల్డీ స్టారర్‌ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుని, ఆ ప్రాజెక్టును లాంచ్ చేయడానికి 11-11-11 అనే మేజిక్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ముందుగా చేసుకున్న ప్లాన్‌ ప్రకారమే 11వనెల - 11వ తేదీ - 11 గంటలకు ఆయన ఈ సినిమాను లాంచ్ చేశారు. ఇక తాజాగా ఆయన మరో మేజిక్ డేట్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 12-12-12 అనేది ఆ మేజిక్ డేట్. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలను గురించి లాంచింగ్ రోజునే రాజమౌళి చెప్పేశారు. అయితే ఆరోజు ఆయన ప్రస్తావిచకుండా వున్నది మాత్రం చిత్రంలోని కథానాయికల గురించి. అందువలన ఈ మేజిక్ డేట్ లో కథానాయికలు ఎవరనే విషయాన్ని ఆయన ప్రకటించవచ్చనే టాక్ వినిపిస్తోంది.  ఏ కథానాయికలను అదృష్టం వరించిందో చూడాలి మరి.