చైనాలో రోబో యాంకర్లు

16:30 - November 10, 2018

ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో యాంకర్లను చైనాలో చేయడం జరిగింది. ఎప్పుడూ టెక్నాలజీతో పోటీపడే చైనా మరోసారి ఈ రోబో యాంకర్ల ఆవిష్కరణకు తెరతీసింది. చైనా - ఇంగ్లీషు భాషల్లో వార్తలు చదివే వీటిని ప్రేక్షకులతో పాటు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. చైనాలో ప్రతి ఏటా జరిగే ‘వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్’ ఈ యాంకర్లను ఆవిష్కరించాయి. చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ జిన్హువాలో ఈ సింథటిక్ వర్చువల్ యాంకర్లను విధుల్లో ఉంచారు. అచ్చు మనుషుల్లా హావ భావాలు పలికిస్తుంటాయి. చైనాలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సౌగౌ - జిన్హువాలు సంయుక్తంగా యాంకరింగ్ రోబోలను అభివృద్ధి చేశాయి. ఈ విషయమై జిన్హువా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ వర్చువల్ యాంకర్లు అలసట లేకుండా పనిచేస్తాయని అన్నారు. 24 గంటు పనిచేస్తాయని చెప్పారు. బ్రేకింగ్ వార్తలను వేగంగా ఈ యాంకర్ల ద్వారా చేరవేయవ్చని అంటున్నారు.