చెర్రీ, తారక్‌లు బుక్కయినట్టేనా?

16:25 - November 14, 2018

రాజమౌళీ ఒక సినిమా తీస్తున్నాడు అంటే అనుకున్న టైం కన్నా ఎక్కువ సమయవమే తీసుకుంటారు అన్నది అందరికీ తెలిసిన విషియమే. కానీ ' బహుబలి 'తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ' RRR '. ఈ చిత్రం కూడా అనుకున్న టైం కన్నా లేటుగానే వస్తది అని అభిమానులు ఫిక్సయ్యారు. కానీ జక్కన్న మాత్రం మాత్రం ఎన్టీఆర్.. చరణ్ లకు ఒక్క ఏడాదిలో షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తానని మాటిచ్చాడాట.  దాంతో పాటు వాళ్ళను ఒక కోరిక కోరాడట.  ' RRR ' కోసం ఒక భారీ సెట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సెట్ లోనే ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు రాజమౌళి. తనతో పాటు హీరోలు ఇతర ముఖ్యమైన టీమ్ మెంబర్స్ నివాసం ఉండేందుకు అవసరమైన వసతులు కల్పించాడట.  ఇందులోకి తను మకాం మారుస్తాడని.. సినిమా పూర్తయనంతవరకూ తన ఇల్లు అదేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ హీరోలను కూడా అక్కడికే మకాం మార్చమని అంటున్నాడట. అంటే ఏడాది పాటు అక్కడే ఉంటూ సినిమాపై ఫోకస్ చెయ్యాలి. సొంత ఇంటికి వెళ్లేందుకు మాత్రం అప్పడప్పుడూ అవకాశం ఇస్తాడు. ఇదేదో కార్పోరేట్ స్కూల్ హాస్టల్  వార్డెన్ లాగా జక్కన్న అయిడియా వేసినట్టు ఉంది కదా. ఏం చేస్తాం.. బాహుబలి లాంటి సినిమా కావాలంటే బాహుబలి డైరెక్టర్ చెప్పిన మాట వినక ఏం చేస్తారు చెర్రీ.. తారక్ లు.  ఫుల్లుగా బుక్కయ్యారు!