చెన్నైలో మరో కొత్త రికార్టును సొంతం చేసుకున్న ' 2.ఓ '

13:12 - November 30, 2018

రజనీకాంత్ కథానాయకుడిగా '2.ఓ' నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.  తొలిరోజున ఈ సినిమా వసూళ్ల పరంగా చెన్నై నగరంలో రికార్డును సృష్టించినట్టు తెలుస్తోంది.  దీపావళి రోజున విడుదలైన 'సర్కార్', తొలిరోజున అక్కడ 2.37 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో నిన్న విడుదలైన '2.ఓ' 2.64 కోట్ల గ్రాస్ ను రాబట్టి, 'సర్కార్' వసూళ్ల రికార్డును అధిగమించి కొత్త రికార్డును సొంతం చేసుకుంది. వీకెండ్ పూర్తయ్యేనాటికి చెన్నై నగరానికి సంబంధించినంత వరకూ మరికొన్ని కొత్త రికార్డులను '2.ఓ' దక్కించుకునే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.