చివరి 20 నిమిషాలు సినిమాకు కీలకం...

13:30 - September 12, 2018

సమంత తొలిసారిగా చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యు టర్న్’. రేపు వినాయక చవితి రోజు విడుదల కానున్న యూ టర్న్‌ సినిమాలో చివరి 20 నిమిషాలు సినిమాకు కీలకం అని సమంత చెబుతుంది. కన్నడలో ఇదే పేరుతో తెరకెక్కిన చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది. ఈ సినిమా కన్నడలో విడుదలైన దగ్గర్నుంచి సమంత దానిపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించింది. ఈ సినిమా తన కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అంటుంది సామ్‌. ఇదే సందర్భంలో తన భర్త నాగచైతన్య సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’కు పోటీగా ‘యు టర్న్’ను రిలీజ్ చేస్తుండటం పట్ల ఎలాంటి టెన్షన్ లేదని ఆమె అంది. ఇలా రెండు సినిమాలూ పోటీ పడాలని తాము కోరుకోలేదని.. ఇలా అనుకోకుండా జరిగిపోయిందని సమంత చెప్పింది. ఈ చిత్రం తెలుగు.. తమిళ భాషలు రెండింట్లోనూ రిలీజ్ కావాల్సి ఉండటంతో విడుదల తేదీ మార్చుకోవడానికి అవకాశం లేకపోయిందని ఆమె అంది.