చిరూ - పవన్‌ల మధ్య చిచ్చు పెడుతున్న రాములమ్మ

17:11 - October 2, 2018

 

తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఇన్నాళ్లు అజ్ఞాతవాసంలో ఉన్న విజయశాంతి ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. స్టార్ క్యాంపెయినర్ పదవిని కూడా చేపట్టారు. అందుకే కాస్త హడావుడి చేస్తున్నారు. విమర్శల వాడిని పెంచుతున్నారు. ఇప్పుడు చిరంజీవీ, పవన్‌కళ్యాణ్‌ల మద్య చిచ్చుపెట్టేందుకు చూస్తుంది రాములమ్మ. తాజాగా విజయశాంతి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ లో ఆవేశమెక్కువట.. రాజకీయాల్లో రాణించడం కష్టమంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఆయన అన్న చిరంజీవితో కలిసి ప్రచారం చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ఒకే రక్తం పంచుకొని పుట్టిన ఆ అన్నాదమ్ముల పార్టీలు వేరు.. సిద్ధాంతాలు వేరు.. అన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కొనసాగుతుండగా.. తమ్ముడు ఆ కాంగ్రెస్ విభేదిగా మారి పోరాడుతున్నాడు. ఇద్దరి దారులు వేరైనా.. వారి మధ్య అనుబంధం మాత్రం ఇంకా పదిలంగానే ఉంది అంటుంది విజయశాంతి. 

 విజయశాంతి టీఆర్ ఎస్ లో వెలుగు వెలిగినప్పుడు చిరంజీవి ప్రజారాజ్యంలో ఉండేవారు. అప్పుడు చిరుపై పరుశ విమర్శలను రాములమ్మ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు విజయశాంతి చిరంజీవిలిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ చిరంజీవి రాజకీయాలపై వైరాగ్యంతో ఇప్పుడు సినిమాలు చేస్తూ కాంగ్రెస్ వాదిగానే మరిచిపోయారు. కాంగ్రెస్ తరఫున ఈ ఎన్నికల్లో పోటీచేస్తాడో లేదో చెప్పలేని పరిస్థితి. అలాంటిది విజయశాంతి ఆయనతో కలిసి ప్రచారం చేస్తానని చెబుతోంది.

ఇక పవన్‌ విషియానికి వస్తే...తెలంగాణలో జనసేనాని పవన్ మద్దతు టీఆర్ ఎస్ కు ఉందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పథకాలను పవన్ అప్పట్లో పొగిడేశాడు. అంతేకాదు.. పవన్ పర్యటనలకు టీఆర్ ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో పవన్-టీఆర్ ఎస్ బంధాన్ని ఎండగట్టాలని విజయశాంతి ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం చిరంజీవి సహాయాన్ని పొందాలని చూస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ గా మారి ప్రచారం చేస్తుందట.. బహుశా ఎంపీగా ట్రై చేద్దామని చూస్తుందేమో.. అయినా పోటీలో లేకుండా ఎంత ప్రచారం చేసినా ఏం లాభమని ప్రత్యర్థులు ఆడిపోసుకుంటున్నారు.