చిరూ అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌

17:32 - August 16, 2018

చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం' సైరా నర్శింహారెడ్డి '. ఈ చిత్రం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్శింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపోందుతుంది. దీనిలో నయనతారా కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, విజయ సేతుపతి, సందీప్‌, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా మరో కీలక పాత్రలో నటించనున్నారు. 
బ్రిటీష్‌ సైన్యంతో ఉయ్యాలవాడ నర్శింహారెడ్డి చేసే సుదీర్ఘ యుద్ధ సన్నివేశాలను ఇటీవలే తెరకెక్కించారు. దీని షఉటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ' ఆర్‌ఎఫ్‌సీ 'లో జరుగుతోంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఏదైనా బయటకు వస్తుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్‌ 22) న అభిమానులకు ఓ భారీ గిఫ్ట్‌ ఇవ్వాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. ఆమేరకు ఈ నెల 21న ఉదయం 11.30 నిమిషాలకు చిత్ర టీజర్‌ను విడదల చేయబోతున్నారు. 
కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నర్శింహారెడ్డ్డిి దేశానికి స్వాతంత్య్రం తేవడం కోసం తనవంతు ప్రయత్నంగా బ్రిటీష్‌ వారితో వీరోచితంగా పోరాడి తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయారు. ఈ చిత్రాన్ని కొనిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.