చిరు తో ' ప్యార్‌ ప్రేమ కాదల్‌ ' టీజర్‌ లాంచ్‌

14:09 - September 18, 2018

ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి రూపొందిన `ప్యార్ ప్రేమ కాదల్` సినిమాకి స్వయంగా చిరంజీవి టీజర్‌ లాంచ్‌ చేయడం జరిగింది.  అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -``ఈ వేడుకకు అంగీకరించడానికి ప్రధాన కారణం ఆ ముగ్గురు. భరద్వాజ - విజయ్ - యువన్ లే కారణం. తమ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జనరేషన్ గ్యాప్ ఉన్నా యువన్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సంగీత దర్శకుడు అతడు. 80లలో ఎన్నో హిట్లిచ్చిన ఇలయరాజా కొడుకు అవ్వడం వల్లనే తనంటే ఇంత ఇష్టం. తను ఇంత బిజీ షెడ్యూల్ లోనూ నిర్మాతగా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ నచ్చడం వల్లనే అని అనుకుంటున్నా. ఇది హిట్టేనని భావిస్తున్నా. ఇక మా అసోసియేషన్ విజయ్ సోదర సమానుడు. అందుకే ఆ ముగ్గురి కోసం వచ్చాను. అలానే యువప్రతిభ పరిశ్రమకు రావాలి. వారి సినిమాల్ని ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తాను. యూత్ ఫుల్ సినిమాలతో పరిశ్రమ బావుంటుంది. కొత్త ఒరవడితో ఫ్రెష్ నెస్ పరిశ్రమకు ఉంటుంది. అందుకే ఏ భాషలో సినిమా అయినా బావుంటే మన తెలుగు ప్రేక్షకులు చూడాలి. అలా తమిళంలో హిట్టయిన ప్యార్ ప్రేమ కాదల్ తెలుగులోనూ హిట్టవుతుందని అనకుంటున్నా. చక్కని యూత్ ఫుల్ సినిమా ఇదని అర్థమవుతోంది. త్వరలో రిలీజవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం అందుకోవాలి. నాయకానాయికలకు - దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.

 ఓవైపు `సైరా-నరసింహారెడ్డి` షూటింగుతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నా చిరంజీవి మరోవైపు ఇతరుల సినిమాల ప్రమోషన్ చేస్తున్నారు. కాదు పొమ్మనకుండా అందరినీ అక్కున చేర్చుకుంటున్నారు.  పరిశ్రమలో ఇదో ఆసక్తికర పరిణామం. తనవద్దకు వచ్చిన వారెవరినీ మెగాస్టార్ నిరాశపరచడం లేదు. తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటి లానే ఇప్పుడూ ఆయన అందరివాడుగా సాయం చేస్తున్నారు.