చిరిగిన నోట్ల మార్పిడిపై ఆర్‌బిఐ తాజా నిబంధన

12:12 - December 21, 2018

చిరిగిన కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా నిబంధన ప్రకటించింది. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన రూ.200, రూ.2000 నోట్లకు సంబంధించి రిజర్వు బ్యాంకు తాజాగా కీలక నిర్ణయం ప్రకటించింది. కొత్త నోట్లు చిరిగిపోయినట్టయితే నోటు చిరిగిన నిడివిని బట్టి వాటి మార్పిడి విలువ ఉంటుందని తెలిపింది. తాజా నిబంధన ప్రకారం రూ.200 నోటు చిరిగిన నిడివి 39 చదరపు సెంటీమీటర్లున్నట్టయితే పూర్తి మార్పిడి విలువ పొందవచ్చు. రూ.2000 నోటు 44 చదరపు సెంటీమీటర్ల లోపు చిరిగినప్పుడే పూర్తి మారకం విలువ ఉంటుంది.