చిన్మయి ఆయన బండారం మొత్తం బయటపెట్టింది

14:10 - December 2, 2018

ఈ మధ్య  #మీటూ క్యాంపెయిన్‌ బాగా వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలోనే సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సీనియర్ గేయరచయిత వైరముత్తు పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.   ఆయనతో ఆపకుండా తమిళ నటుడు రాధారవిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో తమిళ డబ్బింగ్ కళాకారుల సంఘం నుండి చిన్మయిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు రాధారవి. అంతేకాదు చిన్మయి ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశాడు. తమిళ డబ్బింగ్ కళాకారుల సంఘానికి రాధారవి అధ్యక్షుడు.  కానీ చిన్మయిని తొలగించేందుకు ఆయన చూపించిన కారణం గత రెండేళ్ళుగా ఆమె సభ్యత్వ రుసుము చెల్లించకపోవడమేనన్నారు. తను ఈ సంఘంలో శాశ్వత సభ్యురాలినని.. తన సభ్యత్వాన్ని రద్దు చేయడం కుదరని చెప్పింది చిన్మయి. అంతటితో ఆగకుండా టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా రాధా రవికి మరో ఝలక్ ఇచ్చింది. రాధారవి తన పేరుకు ముందు డటోక్ బిరుదును తగిలిస్తూ ఉంటారు.  మలేషియా ప్రభుత్వం వారు తనను ఈ బిరుదు ఇచ్చి సత్కరించారని రాధారవి చెప్పుకుంటారు. కానీ అదంతా అబద్దమని చిన్మయి తేల్చింది. ఈ విషయంపై చిన్మయి మలేషియా ప్రభుత్వానికి ఒక లేఖ రాసి వాస్తవాలు తెలిపాల్సిందిగా కోరారు. ఈ లేఖకు స్పందించిన మలేషియా గవర్నమెంట్  రాధారవికి తమ ప్రభుత్వం డటోక్ బిరుదును ఇవ్వలేదని.. ఇండియాలో ఒక్క షారూఖ్ ఖాన్ ను మాత్రమే ఈ బిరుదుతో సత్కరించడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.  ఇంకేముంది? చిన్మయి సదరు విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి రాధారవి బండారం బయటపెట్టింది.