చిన్నప్పటి నుండీ పోస్లర్లు చూస్తూనే బతికేశాను : నిధి

15:08 - October 26, 2018

ఒక చెయ్యి మాట వినదు.. అలాంటి టిఫికల్ పాత్రలో నటించడం చాలా కష్టం. చాలా తెలివిగా మ్యానేజ్ చేశాడు నాగచైతన్య.. ఆ పాత్రలో ఎక్కడా అసహజంగా కనిపించడు.. అంటూ టాప్ సీక్రెట్ ని రివీల్ చేసింది నిధి అగర్వాల్. ఇందులో చిత్ర అనే పాత్రలో నటించాను. ఇండివిడ్యువల్ ఆలోచనలున్న అమ్మాయిగా కనిపిస్తాను. తనకంటూ ఓ లవ్ స్టోరి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యాక్షన్ థ్రిల్లర్ అయినా నా పాత్రకు స్కోప్ ఎక్కువ ఇచ్చినందుకు చందుకి థాంక్స్.. అని అంది. ఇంతకీ మీరు బెంగళూరు బ్యూటీనా? అని ప్రశ్నిస్తే .. అబ్బే నేను హైదరాబాద్ బ్యూటీనే ఇక్కడే పుట్టానని నిధి చెప్పింది. కన్నడ - తెలుగు - తమిళ్ - హిందీ సినిమాలతో తనకు ఫెమిలియారిటీ ఉందని తెలుగు సినిమాలపైనా నాలెడ్జి ఉందని - అన్ని భాషల సినిమాలకు సంబంధించిన పోస్టర్లు చిన్నప్పటినుంచి చూస్తూనే బతికానని టాప్ సీక్రెట్ ని లీక్ చేసింది. మూవీలో నాగచైతన్య ఎడమచేతి వాటం కదా.. ఇంతకీ మీరు లెఫ్ట్ హ్యాండా?  రైట్ హ్యాండా? అని ప్రశ్నిస్తే..నేను పుట్టుకతోనే లెఫ్ట్ హ్యాండర్ ని. కానీ అమ్మా నాన్న నన్ను రైట్ హ్యాండర్ గా మార్చేశారు. ఆరంభం ఎడమచేతితోనే రాసేదాన్ని. కానీ నెమ్మదిగా కుడి చేతికి మారిపోవాల్సిందిగా అమ్మా నాన్న అనడంతో అలా మారిపోయానని నిధి వేరొక రహస్యాన్ని లీక్ చేసింది. నవంబర్ 2న రిలీజ్ కి రెడీ అవుతున్న తమ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరింది.