చాలా ఫీలవుతాను...

11:51 - September 3, 2018

శ్రియా హీరోహిన్‌గా దాదాపు 16 ఏళ్లు కంప్లీట్‌ చేశారు. ఇన్నేళ్ల ఈ జర్నీలో ఫ్లాప్‌ అయిన సినిమాల గురించి మీరెప్పుడైనా ఫీలయ్యారా? అన్న ప్రశ్నను ఆమె ముందు ఉంచినప్పుడు...ఫెయిల్‌ అయిన కొన్ని సినిమాలు కెరీర్‌పై కూడా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. అందుకే ఫెయిల్‌ అయిన సినిమా గురించి చాలా ఫీలవుతాను అని శ్రియా చెప్పింది. సినిమా ఫీల్డ్‌లో తప్పులను కరెక్టు చేసుకోవడం చాలా కష్టం. పుస్తకాలను ఎంచుకున్నంత బాగా నేను స్క్రిప్ట్‌ను ఎంచుకోలేను అని శ్రియా చెప్పుకొచ్చారు. అయితే..సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్‌ వంటి చిత్రాల్లో నటించి వెండి తెరపూకి వచ్చిన శ్రియా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాధించుకున్నారు. 
ప్రస్తుతం ఆమె చేసిన సినిమాల విషయానికొస్తే సౌత్‌లో ఆమె నటించిన ' ' ' 'నరగాసురన్‌, వీరభోగ వసంతరాయలు', హిందీలో ' తడ్కా ' మూవీస్‌ రిలీజ్‌కు రెడీగా వున్నాయి.