చరణ్‌ సినిమాకు పోటీ వద్దు: వరుణ్‌ తేజ్‌

12:28 - November 23, 2018

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఎఫ్ 2'  సినిమాను  పూర్తి వినోదభరితమైన మల్టీ స్టారర్ గా మలిచారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే...చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన 'వినయ విధేయ రామ' కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో  చరణ్ సినిమాకి పోటీగా తన సినిమా రావడం వరుణ్ తేజ్ కి ఎంతమాత్రం ఇష్టం లేదట.  మెగా అభిమానుల ఆదరణ పూర్తిగా పొందాలంటే కొంత గ్యాప్ తీసుకోవడం అవసరమనీ, 'ఎఫ్ 2'ను జనవరి 25వ తేదీన విడుదల చేయడం మంచిదని దిల్ రాజుతో చెప్పాడట. ఒక నిర్మాతగా దిల్ రాజు నిర్ణయం అనేక లావాదేవీలతో ముడిపడి వుంటుంది గనుక, ఇంకా ఆయన ఏమీ చెప్పలేదని తెలుస్తోంది.