చరణ్‌, విజయ్ లకి ఒకటే స్థానం...ఎలా?

11:23 - December 6, 2018

నిన్న ప్రకటించిన టాప్ 100 ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్ట్ పలు చర్చలకు దారి తీస్తోంది. ఇందులో రామ్ చరణ్ కు విజయ్ దేవరకొండకు ఒకటే 72 ర్యాంకును కేటాయించిన ఫోర్బ్స్ సంపాదన ఇద్దరికీ 14 కోట్లుగానే చూపిస్తోంది. నిజానికి ఇది షాక్ కలిగించేదే. ఏ రకంగా చూసుకున్న విజయ్ దేవరకొండ ఇంకా చరణ్ రేంజ్ కి చేరుకోలేదు అన్నది వాస్తవం. ఇటీవలే వచ్చిన టాక్సీవాలా బిజినెస్ పది కోట్ల లోపే జరగగా సంక్రాంతి రాబోతున్న వినయ విధేయ రామ మీద ఏకంగా వంద కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలు ప్రస్పుటంగా ఉన్నాయి. రెమ్యునరేషన్ లెక్కల్లో చూసుకున్నా చరణ్ ను ఇప్పటికిప్పుడు అనుకోలేనంత దూరంలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. మరి ఏ ప్రాతిపదికన ఆదాయాన్ని 14 కోట్లుగా డిసైడ్ చేసి ఇద్దరికీ 72వ స్థానాన్ని ఇచ్చారన్నదే మెగా ఫాన్స్ ప్రశ్న.  దానికి శాస్త్రీయ సమాధానం ఫోర్బ్స్ ఇస్తుందన్న గ్యారెంటీ లేదు . ఇదిలావుంటే...దేవరకొండ ఫ్యాన్సు మాత్రం తమ హీరో స్థాయి పెరిగింది అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ ఇంకేం కావాలంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు.  రామ్ చరణ్ ఎలాంటి బ్రాండ్ ఎండార్స్ మెంట్లు చేయడు కాబట్టి ఆ ఆదాయాన్ని మైనస్ చేసుకుని ఇలా ఇచ్చి ఉండొచ్చని మరో విశ్లేషణ ఉంది. ఏదైతేనేం చరణ్ విజయ్ లను ఒకే స్థానంలో పెట్టడం మెగా ఫాన్స్ కు రుచించకపోయినా అర్జున్ రెడ్డి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషిలో ఉన్నారు