చరణ్‌, తారక్‌ల కలయిక అనుకున్నటైం కన్నా ముందేనట!

12:21 - October 29, 2018

 రాజమౌళి మల్టీ స్టారర్ షూటింగ్ కు అడుగులు వేగంగా పడనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలయిక గురించి ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. నవంబర్ 18 డేట్ ప్రచారంలోకి వచ్చింది కానీ అంతకన్నా ముందే మొదటివారంలోనే షూటింగ్ కు ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. చరణ్ తారక్ ఇద్దరూ కలిసి పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి ఆ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది.  ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనేది కామనే  కానీ వాళ్ళతో పాటు మరో విదేశీ వనిత కూడా కీలక పాత్రలో కనిపిస్తుందట. సో అనుకున్న టైం కన్నా ముందే మొదలుకాబోతున్న ఆర్ ఆర్ ఆర్ నవంబర్ నుంచి సంచలనాలు రేపబోతోంది. ఇంకో ఏడాదికి పైగా షూటింగ్ ఉంటుంది కాబట్టి 2020లోనే ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. రాజమౌళి సబ్జెక్టులు డిమాండ్ చేసినట్టు హీరోలకు వేరే ఆప్షన్ పెట్టుకునే ఛాయస్ ఉండదు. సో పూర్తిగా ఈ ఇద్దరూ లాక్ అయిపోయినట్టే. బయట ఎక్కడైనా ఫంక్షన్స్ లో చూసుకోవడం తప్పించి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించరు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత తారక్ సినిమా ఇదే. చరణ్ బోయపాటితో చేస్తున్న మూవీ షూటింగ్ చివరి స్టేజిలో ఉంది కాబట్టి సంక్రాంతికి ఆ ఒక్కటి చూసుకోవచ్చు.