చరణ్‌తో పైడిపల్లి మరో మూవీ

10:52 - September 7, 2018

వంశీ పైడిపల్లి రామ్‌ చరణ్‌తో ' ఎవడు ' లాంటి బ్లాక్‌ బాస్టర్‌ మూవీని తెరకెక్కించారు. ఆ తరువాత మరో సినిమా చరణ్‌తో తీయాలనుకున్న పైడిపల్లి ఆలోచన ఏదోఒక కారణంగా ఆగిపోయింది. కానీ ఈసారి పైడిపల్లి ఆ చాన్స్‌ను మిస్‌ చేసుకోదలుచుకోలేదంట. `ఎవడు` చిత్రానికి పని చేసిన హరి అనే రచయిత ఓ ఆసక్తికర లైన్ ని పైడిపల్లికి - చరణ్ కి వినిపించాడట. ఆ లైన్ ఇద్దరికీ నచ్చింది. వెంటనే డెవలప్ చేయాలని చెర్రీ ఆర్డర్స్ వేశాడట. అంటే పూర్తి స్క్రిప్టు రెడీ అయ్యి చరణ్ కి నచ్చితే ఇక సెట్స్ పైకి వెళ్లిపోవడమే. ప్రస్తుతం రామ్ చరణ్ ఓవైపు బోయపాటి దర్శకత్వంలో ఆర్ సి 12 చిత్రం తెరకెక్కిస్తూనే - మరోవైపు `సైరా-నరసింహారెడ్డి` లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్ సి 12 సంక్రాంతికి రిలీజవుతుంది. సైరా సమ్మర్ కి ప్లాన్ చేశారు. అంటే పైడిపల్లి స్క్రిప్టు రెడీ అయితే 2019 ఎండింగ్ లో కానీ లేదా 2020లో కానీ ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుందన్నమాట.

రెండేళ్లకో సినిమా చొప్పున తాపీగా పని చేయడం వంశీ పైడిపల్లి అలవాటు. అలా పదేళ్ల కెరీర్ లో అతడు తీసింది ఐదారు సినిమాలే. గతంలో ఎన్టీఆర్ - చరణ్ - ప్రభాస్ లాంటి స్టార్లను డైరెక్ట్ చేశాడు పైడిపల్లి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ ల్యాండ్ మార్క్ మూవీ `మహర్షి`ని బ్లాక్ బస్టర్ చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నాడు.