చంద్రబాబుగా మారిన రానా

17:54 - September 7, 2018

బాహుబలిలో బల్లాలగా అందరినీ ఆకట్టుకున్న రానా దగ్గుపాటి..మరోసారి ఇంకొక పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.  'ఎన్టీఆర్' లో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో  రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే రానా క్లీన్ షేవ్ చేసుకొని - మీసాలు పెంచి బాబును మక్కికి మక్కి దించే ప్రయత్నాలలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. . చంద్రబాబు మేనరిజం.. మాట్లాడే తీరు ఇవన్నీ కాపీ కొట్టేందుకు పాత వీడియోలు కూడా చూస్తున్నాడని అన్నారు.

అయితే ఈ ఫోటో చూస్తే మాత్రం పైవన్నీ నిజమే అనిపిస్తుంది. రీసెంట్‌గా షూటింగ్ లొకేషన్‌ నుండి ఒక పిక్‌ లీక్‌ అయింది. ఈ ఫోటోలో పూర్తిగా చంద్రబాబులా మారిన రానా కనిపిస్తాడు. రీసెంట్ గా రానా నాన్నగారు సురేష్ బాబు మాట్లాడుతూ "పూర్తిగా చంద్రబాబుగా మారిన రానాను" చూసి షాక్ అయ్యానని చెప్పారు.