గులాబీ అభ్యర్థుల రిక్వెస్ట్‌ విని కేసీఆర్‌ షాక్‌..!

12:56 - October 23, 2018

ఏ పార్టీలోనైనా అభ్యర్థులు ఏమైనా రిక్వెస్ట్‌ చేస్తే పార్టీ అధినేత దానిని తీర్చడమో లేక వీలుకాదని చెప్పడమో జరుగుతుంది. కానీ టీఆర్‌ఎస్‌లో అలా జరగలేదు..అభ్యర్థులు చేసిన రిక్వెస్ట్‌కు కేసీఆర్‌ షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెలితే...నేతలు పోలీసు రక్షణ కోరటం మామూలే. మావోల నుంచి రక్షణ కోసం కోరుతుంటారు కానీ సామాన్య ప్రజల నుంచి వెల్లువెత్తే వ్యతిరేకత నుంచి తమను తాము రక్షించుకోవటం కోసం సెక్యురిటీని మరింత పెంచాలన్న అభ్యర్థుల రిక్వెస్ట్ కేసీఆర్ కు షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు. అసలు విషియానికి వస్తే... గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు.. ఆ మాటకు వస్తే చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించింది.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నది లేదు. ప్రజల సమస్యల్ని పెద్దగా పట్టించుకోకుండా తమ దారిన తాము ఉండటం.. తమ వ్యక్తిగత ప్రయోజనాల మీద దృష్టి పెట్టారే కానీ.. ప్రజా సమస్యల పరిష్కారం మీద పెద్దగా ఫోకస్ చేసింది లేదు.  ఇదిలా ఉంటే.. తాజాగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా వెళుతున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు పలు గ్రామాల్లోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో గ్రామాల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను  అధిమించేందుకు వీలుగా పోలీసు సెక్యురిటీని మరింత పెంచాలన్న రిక్వెస్ట్ వారి నుంచి వస్తోంది.తాను చేయించిన సర్వేల్లో భారీ మెజార్టీతో పార్టీ గెలుస్తుందన్న అంచనాలు చెబుతున్న కేసీఆర్ మాటలకు భిన్నంగా గ్రౌండ్లో ఇలాంటి పరిస్థితి ఉండటం ఇప్పుడు పార్టీలో  పెద్ద సమస్యగా మారింది.