గీతా ఆర్ట్స్‌లో కాదు...సపరేట్‌ అంటున్న బన్నీ...

15:25 - September 24, 2018

ఇప్పటి దాకా తనకంటూ స్వంత ఆఫీస్ లేని ముచ్చటను బన్నీ తీర్చేసుకున్నాడు. ఇప్పటి దాకా వ్యవహారాలన్నీ గీత ఆర్ట్స్ ఆఫీస్ లోనే నడిపిన అల్లు అర్జున్ అందులో తన కోసం ఒక ప్రత్యేకమైన క్యాబిన్ లో మీటింగ్స్ పెట్టుకునే వాడు. కానీ రాను రాను గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యవహారాలు ఎక్కువ కావడంతో పాటు గీత ఆర్ట్స్ 2 పేరుతో బయట హీరోలతో వరసగా సినిమాలు నిర్మాణమవుతున్న నేపధ్యంలో ప్రైవసీ కోరుకుంటున్న అల్లు అర్జున్ సెపెరేట్ సెటప్ పెట్టుకున్నాడని తెలిసింది. ఇందులో పిఆర్ టీమ్ తో పాటు బ్రాండ్ డీలింగ్స్ అగ్రిమెంట్స్ చేయడానికి స్పెషల్ గా ఎంప్లొయ్స్ ని  అపాయింట్ చేసుకున్నట్టు తెలిసింది. ఇదంతా ఓకే కానీ నా పేరు సూర్య ఇచ్చిన షాక్ కి బాగా గ్యాప్ తీసుకున్న బన్నీ ఆ కొత్త సినిమా ముచ్చట ఏదో త్వరగా చెప్పేస్తే బెటర్.  అభిమానులు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా టైం వచ్చినప్పుడు చెబుతాను అంటున్నాడు తప్ప ఫలానా దర్శకుడితో ఫలానా టైంలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని మాట వరసకు కూడా చెప్పడం లేదు. విక్రమ్ కుమార్ తో ఫిక్స్ అయిపోయింది అన్నారు కానీ ఇప్పుడు దాని గురించి ఏ చప్పుడూ లేదు. త్రివిక్రమ్ తో అనే కొత్త న్యూస్ వచ్చింది కానీ అసలు మాటల మాంత్రికుడు వెంకటేష్ తో చేస్తాడా లేక బన్నీ వైపు వస్తాడా అనే స్పష్టత రావడానికి ఇంకో నెల రోజులకు పైగా పడుతుంది.