గిన్నీస్‌ బుక్‌లో చేరనున్న కౌశల్‌

13:33 - October 5, 2018

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది మాత్రం ముమ్మాటికీ కౌశల్‌ ఆర్మీ వల్లే అన్న విషియంలో ఎటువంటి సందేహ లేదు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2 అయిపోయిన తరువాత కూడా కౌశల్‌ క్రేజ్‌, ఫాలోయింగ్‌ మామూలుగా లేదు. వేలాది మంది ప్రతి రోజు కూడా ఓట్లు వేస్తూ కౌశల్ ను గెలిపించారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు - ఏ కంటెస్టెంట్ కు కూడా దక్కని ఓట్లు కౌశల్ కు దక్కాయి.ఒకపక్క కౌశల్‌ ఆర్మీ...కౌశల్‌తో ఒక సినిమా చేయాలన్న సంకల్పంతో వున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే...తాజాగా కౌశల్‌కు మరో సువర్ణవకాశం చేచిక్కింది. 
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న కౌశల్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుండి నాకు కాల్ వచ్చిందని - బిగ్ బాస్ తో పాటు ఇతర రియాల్టీ షోల్లో అప్పటి వరకు ఏ ఒక్కరికి రానన్ని ఓట్లు మీకు వచ్చిన కారణంగా మీ పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చుతున్నట్లుగా చెప్పారు అంటూ స్వయంగా కౌశల్ ప్రకటించాడు. అతి త్వరలోనే గిన్నీస్ బుక్ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తనతో అన్నారని కౌశల్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో రామ్ చరణ్ మూవీలో మీరు నటించబోతున్నారా అంటూ ప్రశ్నించగా... రామ్ చరణ్ - బోయపాటిల చిత్రంలో ఛాన్స్ వచ్చిన మాట వాస్తవమే కాని - ఇంకా ఒప్పందం చేసుకోలేదని - త్వరలోనే అది జరిగే అవకాశం ఉందని - ఆ తర్వాత నేనే ప్రకటిస్తాను అంటూ కౌశల్ చెప్పుకొచ్చాడు.