' ఖైదీ నెంబర్‌ 150 ' రికార్డును బ్రేక్‌ చేయనున్న ' అరవింద '

16:30 - October 26, 2018

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ' అరవింద సమేత వీరరాఘవ ' చిత్రం..చిరంజీవి నటించిన ' ఖైదీ నంబర్‌ 150 ' రికార్డును బ్రేక్‌ చేయనుంది. దసరా కానుకగా విడుదలైన ' అరవింద ' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా 150 కోట్ల మార్క్‌ను దాటేసి... ఎన్టీఆర్ కెరీర్‌లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పటి వరకూ ఈ సినిమా 158 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. చిరు నటించిన' ఖైదీ నంబర్‌ 150 ' చిత్రం రూ.164 కోట్ల గ్రాస్‌ను సాధించి 5వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ' అరవింద సమేత ' 5వ స్థానానికి సిద్ధమవుతోంది. దాదాపు మరో వారంలో ఈ చిత్రం ' ఖైదీ నంబర్‌ 150 ' ని దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది.