ఖర్చయినా, స్వీకరణయినా రూ. 10 వేలు మాత్రమే: ఎన్నికల సంఘం

11:03 - November 26, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగన్ను నేపథ్యంలో..ఎన్నికల సంఘం ఆంక్షలను జారీ చేస్తుంది. ఎన్నికల వేల అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బును ఖర్చుపెడాతారు..అది అందరికీ తెలిసిన విషియమే. దానిని కట్టడి చేసేందుకు తాజాగా ఎన్నికల సంఘం ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎన్నికల వ్యయం, విరాళాల స్వీకరణపై ఎన్నికల సంఘం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల్లో నగదు రూపంలో ఖర్చు చేసినా, విరాళంగా స్వీకరించాలన్నా రోజుకి పది వేల రూపాయలకే అనుమతిచ్చింది. అంతకు మించితే అకౌంట్‌ బేస్‌గా జరగాలని ఆదేశించింది. అంటే చెక్‌, డీడీ, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో లావాదేవీలు కొనసాగించాలని సూచించింది. గతంలో  రోజువారీ నగదు పరిమితిని రూ.20 వేలుగా నిర్ణయిస్తూ 2011లో ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో తాజా మార్పులు చేసింది. అయితే ఎన్నికల్లో మితిమీరుతున్న ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 40ఎ(3)కు 2017లో చేసిన సవరణల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది.