క్రియేటివిటీకి సంకెళ్లు వేయడం మంచిది కాదు: వరలక్ష్మీ

17:03 - November 10, 2018

విజయ్ - మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యావరేజ్ టాక్ ను దక్కించుకున్నా కూడా భారీ వసూళ్లను సాధిస్తూ రికార్డులను సృష్టించింది. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలను కొన్నింటిని తొలగించాలంటూ అక్కడి అధికార ప్రభుత్వం అన్నాడిఎంకే కార్యకర్తలు, నాయకులు వివాదాలు సృషించిన సంగతి తెలిసిందే.  కొన్ని ఏరియాల్లో సినిమాను క్యాన్సిల్ చేస్తున్నారు - మరి కొన్ని ఏరియాల్లో సినిమా హాల్స్ వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. మొత్తం మీద మురుగదాస్ పై అన్నాడీఎంకే నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం తమిళనాట అన్నాడీఎంకే అధికారంలో ఉన్న కారణంగా ‘సర్కార్’ చిత్ర దర్శకుడు మురుగదాస్ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ అంతా అంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో చిత్రంలోని విలన్‌గా నటించిన వరలక్ష్మీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నాడిఎంకే పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని ట్విట్‌ ద్వారా తెలియజేసింది. ఆ ట్విట్‌ ఏంటంటే... ట్విట్టర్ లో వరలక్ష్మి శరత్ కుమార్.. ఒక సినిమాని చూసి ఇంతగా భయపడుతున్నారు మీ ప్రభుత్వం మరీ ఇంత బలహీనమా? మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ బలహీనతను మీరు బయట పెట్టుకున్న వారు అయ్యారు. ఇప్పటికైనా మీరు మీ తెలివి తక్కువ పనులు మానేయండి - క్రియేటివిటీకి సంకెళ్లు వేయాలని ప్రయత్నించడం ఏమాత్రం మంచిది కాదు అంటూ వరలక్ష్మి ట్వీట్ చేసింది. ఈ ట్విట్‌ చూసిన అన్నాడిఎంకే కార్యకర్తలు, నాయకులు ఏవిధంగా రియాక్ట్‌ అవుతారో అనేది వేచి చూడాల్సిందే.