క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకునేందకు రెడీ అవుతున్న నాని..

14:13 - September 10, 2018

న్యాచురల్‌ స్టార్‌ నాని క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకోవడానికి రెడీ అవుతున్నారంట. అదేంటీ ఇప్పుడు నాని క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకోవడమేంటి? అని ఆలోచిస్తున్నారా..అది నిజమే. ప్రస్తుతం నాని, అక్కినేని నాగార్జునతో కలిసి ' దేవదాస్‌ ' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఈనెల చివరిలో విడుదల కానుంది. అయితే దీని తరువాత నాని ' జెర్సీ ' సినిమాలో నటించనున్నారు. ఆ సినిమాలో నాని పాత్ర క్రికెటర్‌ అంట. దాని కోసమనే నాని క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకోటానికి రెడీ అవుతున్నారని సమాచారం.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ' జెర్సీ ' సినిమాకు తమిల సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో 'నర్తనశాల' ఫేం కష్మీర పరదేశి హీరోయిన్ నటిస్తున్నారు.   ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం అవుతుందట.