కౌశల్‌ పట్టుదల నాకు నచ్చింది: కత్తి కార్తిక

16:41 - September 28, 2018

బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఫైనల్‌కు ఇంకా రెండు రోజులే టైం వుంది. వున్న ఐదుగురిలో ఎవరు ఫైనల్‌కు వెళ్తారా అని అందరూ ఆసక్తిగా వున్నారు. ప్రేక్షకుల దేవుళ్లు తమ ఓట్లతో ఎవరిని గెలిపిస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకూ వున్న ఐదుగురిలో బయట నుండి ఎక్కువగా ఓటింగ్‌ వస్తుంది మాత్రం కౌశల్‌కి అన్నది అందరికీ తెలిసిన విషియమే. ఎందుకంటే ఓటింగ్‌ వేసే ప్రతి ఒక్కరికీ ఆ గ్రాఫ్‌ కనబడుతూనే వుంటుంది.  అయితే తాజాగా కౌశల్ గురించి, అలాగే కౌశల్ ఆర్మీ గురించి బిగ్‌బాస్ సీజన్  కంటెస్టెంట్ కత్తి కార్తీక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

''నేను అబ్బాయిల్లో కౌశల్‌ని ఇష్టపడతాను. నేను చూసిన ఎపిసోడ్స్‌ను బట్టి కౌశల్‌లో నాకు నచ్చిందేంటంటే.. ఎంతమంది కార్నర్ చేస్తున్నా ఆయన పట్టుదల నాకు చాలా నచ్చింది. అంటే హౌస్‌లోనే కాకుండా లైఫ్‌లో కూడా ఆ పట్టుదల చాలా ఇంపార్టెంట్. ఎంతమంది మనల్ని కార్నర్ చేసినా కానీ మనకోసం.. మన ఫ్యామిలీ కోసం.. మనల్ని ఇష్టపడే వారి కోసం మనం నిలబడతాం కదా. అది చాలా బాగుంటుంది.

 నాకు తెలిసి ఇంటి బయటకు వచ్చినా కూడా అతను అదే యాటిట్యూడ్‌తో ఉంటాడు. అదే యాటిట్యూడ్ ఉంటే మాత్రం కౌశల్ ఆర్మీ... లేదంటే వాళ్ల సపోర్టర్స్ కౌశల్‌ని ఇంకా ప్రేమిస్తారు ''అని చెప్పుకొచ్చింది కార్తీక.