కౌశల్ ఆర్మీని నిషేదించాలంటున్న బాబూ గోగినేని

కౌశల్ ఆర్మీపై బాబూ గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశల్ ఆర్మీ క్రియేట్ అవడంలో అతని పాత్ర ఉంది. ఈ ఆర్మీ అతని పాపులారిటీ నుంచి పుట్టింది కాదు. అసలు ఏంటా కౌశల్ ఆర్మీ? తమషా ఆపేయండి ఇక. మీకు గనుక నిజంగా ఆసక్తి ఉంటే.. ఇండియన్ ఆర్మీలో చేరి.. కనీసం జాతికైనా సేవ చెయ్యండి. బిగ్బాస్ అనేది జస్ట్ గేమ్ మాత్రమే. జీవితం అనేది బిగ్గర్ బాస్. ఇలాంటి సిల్లీ ఆర్మీస్ని తప్పనిసరిగా నిషేధించాలి’’ అని తాజాగా ఈ ఆర్మీ గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు గోగినేని తెలిపారు.
బిగ్బాస్ సీజన్ 2 ఎంత పెద్ద పాపులర్ అయిందో తెలియదు కానీ ఈ షో కారణంగా పుట్టిన కౌశల్ ఆర్మీ మాత్రం బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీయే కనిపిస్తోంది. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఈ ఆర్మీ పేరుతో చాలా గ్రూపులు కనిపిస్తాయి. ట్విటర్ ఓపెన్ చేసినా ఇదే పరిస్థితి.
ఇటీవల కోనా వెంకట్ ప్రేక్షకులతో మాట్లాడుతూ ‘మీ ఆర్మీ మొత్తం మా సినిమా చూసినా చాలు.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అన్నారంటే కౌశల్ ఆర్మీ ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.