కౌశల్‌ అన్న మాటపై హౌజ్‌లో రచ్చ రచ్చ

15:30 - September 20, 2018

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముంగింపు దశకు వచ్చింది. దీంతో హౌజ్‌లో టాస్క్స్‌తో పాటు గొడవలు కూడా పెరుతున్నాయి. హౌజ్‌లో ప్రస్తుతం కౌశల్‌, సామ్రాట్‌, దీప్తీ, తనిష్‌, రోల్‌ రైడా, గీతా మాధురి వున్నారు. అయితే వీరిలో కౌశల్‌ ఒక్కడు ఒకవైపు, మిగిలిన ఐదుగురూ ఒకవైపు లాగా వుంటున్నారు.కౌశల్ ప్రస్తుతం ఇంట్లో ఏకాకి అంటూ కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కౌశల్ ను ఇంటి సభ్యులు ఏకాకిని చేసి ఆడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కౌశల్ ను వారు ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో తాజా ఎపిసోడ్ తో క్లారిటీ వచ్చేసింది. గీతా మాధురి మరియు కౌశల్ ల మద్య ఒక విషయమై చర్చ జరుగుతున్న సమయంలో అంతా కూడా కౌశల్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. అదే సమయంలో తననే ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆమెను ఎందుకు ప్రశ్నించరు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు కౌశల్ .

అందరు తనపై కుక్కల్లా పడుతున్నారు అంటూ కౌశల్ ఆవేశంలో మాట అనేశాడు. దాంతో ఇంటి సభ్యులు అంతా కూడా ఒక్కసారిగా కౌశల్ పై దాడి చేసినంత పని చేశారు. తనీష్ నీ సంగతి బయట చూస్తా అంటూ హెచ్చరించాడు.  ముఖ్యంగా సామ్రాట్ ఒరేయ్ అంటూ మీది మీదకు వచ్చాడు. ఇక రోల్‌ రైడా అయితే ఏకంగా కళ్ల నీళ్లు పెట్టుకొని అక్కడ సీన్‌ క్రియేట్‌ చేశాడు. కౌశల్ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన ఇంటి సభ్యులు అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అదే సమయంలో రోల్ రైడాది ఫేక్ ఎమోషన్ అంటూ కౌశల్ అనడంతో మరోసారి ఇంట్లో రచ్చ జరిగింది. మరో వైపు కౌశల్ ఆర్మీ ఈ విషయంలో కూడా కౌశల్ కు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు కుక్క అంటూ సంబోధించుకున్న వీడియోలు పోస్ట్ చేసి అప్పుడు లేని ఇబ్బంది అప్పుడు రాని కోపాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఒకానొక సమయంలో రోల్ ను తనీష్ కుక్కలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు అదే సమయంలో  గీత మాధురి అవును నేను కుక్కనే అనడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ ట్రెండ్ చేస్తోంది. 

మొత్తానికి ఇంటి సభ్యులందరూ ఒక్కటై.. కౌశల్‌ని ఒంటరి చేసి కక్ష సాధింస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే వాళ్లాడే టాస్క్స్‌ల్లో కూడా దాన్ని గేమ్‌లాగా ఆడకుండా...ఒకరికొకరు మద్దతిచ్చుకుంటున్నారు. నిన్న జరిగిన టాస్క్‌ లో కౌశల్‌ ఒక్కడే పూర్తిస్థాయిలో ఆడాడు అనడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది.