కౌశల్‌ని హీరో చేసేందుకు మళ్లీ సిద్ధమవుతున్న కౌశల్‌ ఆర్మీ !

14:59 - October 2, 2018

ఒకొక్కల్లకి ఒకానొక సమయంలో అదృష్టం వరిస్తుందీ అంటారు. సరిగ్గా కౌశల్‌ విషియంలో అలాగే జరిగింది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 వల్ల కౌశల్‌కు అభిమాన దేవుళ్లు లెక్కలేనంత మంది తయారయ్యారు. గతంలో అతి తక్కువ మందికి తెలిసిన కౌశల్‌ బిగ్‌ బాస్‌2 ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకూ చాలా దగ్గరయ్యారు. ఎంతగా అంటే వారి అభిమానంతో కౌశల్‌ను మూవీ హీరో చేసేంతగా..ఇంత అభిమానం సంపాదించుకున్న కౌశల్‌కు అదృష్టం వరించినట్లే కదా మరి. బిగ్‌ బాస్‌ 2 లో కౌశల్‌ ఆర్మీ అభిమానం ఎంతగా చూపించారో అనటానికి సాక్ష్యం కౌశల్‌ని బిగ్‌ బాస్‌2 విజేతగా నిలపడమే అన్నది తెలిసిన విషియమే. కౌశల్ ఇప్పటికే పలు  సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన కౌశల్ బుల్లి తెరపై కొన్ని సీరియల్స్ లో విలన్ గా నటించాడు. ఇక ఇప్పుడు కౌశల్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మంచి దర్శకుడు మంచి నిర్మాత వస్తే తప్పకుండా సినిమాను చేస్తాను అంటూ ప్రకటించిన కౌశల్ కు నిర్మాతలుగా మేం వ్యవహరిస్తాం అంటూ కౌశల్ ఆర్మీ ముందుకు వచ్చిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ నుండి సమాచారం అందుతుంది.  కౌశల్ హీరోగా 4 కోట్ల బడ్జెట్ తో ఒక సినిమాను నిర్మించేందుకు ఆయన అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం పదుల సంఖ్యలో అభిమానులు ఫండ్ ను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఈమద్య ‘మను’ అనే క్రౌడ్ ఫడ్డింగ్ మూవీ వచ్చింది. మరో రెండు మూడు కూడా తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే కౌశల్ ఆర్మీ కూడా ఇలా కౌశల్ అభిమానులు కూడా సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు మంచి కథ దర్శకుడు సిద్దం అయితే కౌశల్ హీరోగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. త్వరలోనే ఈ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కౌశల్ ఆర్మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.