కౌశల్‌కు జై కొడుతున్న అమిత్‌

11:14 - September 20, 2018

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 నుండి ఇటీవలే అమిత్‌ బయటికి రావడం జరిగింది. సినిమాల్లో విలన్ వేశాలు వేసిన అమిత్ బిగ్ బాస్లో మాత్రం కమెడియన్ గా మారిపోయాడు. మొదట అమిత్ అమాయకత్వపు ముసుగు వేసుకుని ఆట ఆడుతున్నట్లుగా అంతా భావించారు. కాని అతడి నిజ స్వరూపమే అది అని ఆ తర్వాత తేలిపోయింది. ఇంట్లో అందరి కంటే ఎక్కువగా సేమ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ విమర్శలు పొందిన అమిత్ - ఆ సేఫ్ గేమ్ కారణంగానే ఇన్నాళ్లు ఇంట్లో కొనసాగాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  అయితే అమిత్ బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే...అమిత్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో వున్నప్పుడు కౌశల్‌తో అంత క్లోజ్‌గా వుండేవాడు కాదు. ఇతనే కాదు హౌజ్‌లో ఎవరూ కూడా కౌశల్‌తో క్లోజ్‌గా వుండరు. కొన్ని సార్లు అమిత్‌కు కౌశల్‌తో గొడవలు కూడా జరిగాయి.  అయితే....అమిత్ ఎలిమినేట్ అయిన తర్వాత పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూల్లో ప్రతి సారి కూడా కౌశల్ కు జై కొట్టాడు. కౌశల్ అభిమానులను - కౌశల్ ఆట తీరును ప్రశంసించాడు. ఒక ఇంటర్వ్యూలో కౌశల్ కు సెల్యూట్ కూడా చేశాడు. ప్రస్తుతం కౌశల్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో వారిని మచ్చిక చేసుకునేందుకు అమిత్ ఇలా సేఫ్ గేమ్ ఆడినట్లుగా - సేఫ్ సైడ్ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.