కోలీవుడ్‌లో మల్టీ స్టారర్‌ ట్రెండ్‌

17:20 - September 4, 2018

కోలీవుడ్‌లో మల్డీ స్టారర్‌ ట్రెండ్‌ మోదలైంది. అదే సూర్యా నటిస్తున్న 37వ చిత్రం. దీనికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. గతంలో వీడొక్కడే, బ్రదర్స్‌ లాంటి సినిమాలకు దర్శకుడైన కెవి. ఆనంద్‌...ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో సూర్యతో పాటు మలయాళీ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో చేసాక ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ను మన్యం పులి సక్సెస్ ఇంకా దగ్గర చేసింది. అంతే కాదు వరుడు సినిమాతో విలన్ గా పరిచయమైన ఆర్య  ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ తాతయ్యగా ముద్ర వేసిన బోమన్ ఇరానీ మరో పాత్రలో కనిపిస్తారు. హీరోయిన్ గా సాయేషా నటిస్తోంది. అఖిల్ సినిమాతో సౌత్ కు పరిచయమయ్యింది ఈ భామే. ఇటీవలే కార్తీ చినబాబులో కూడా పలకరించింది. ఇలా తెలుగు వాళ్లకు అన్ని రకాలుగా కనెక్ట్ అవుతున్న ఈ మల్టీ స్టారర్  ఇక్కడ కూడా క్రేజ్ తెచ్చుకోవడంలో డౌట్ లేదు.

ఇప్పటికే సౌత్‌లో మల్డీ స్టారర్‌ ట్రెండ్‌ ఊపందుకొంది. ముఖ్యంగా సీనియర్ హీరోలు యూత్ స్టార్లతో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. నాగార్జున నానిల దేవదాస్ షూటింగ్ పూర్తి చేసుకునే దశలో 27 విడుదలకు రెడీ అవుతుండగా సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్న వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్2 కూడా మాంచి జోరు మీదుంది. వెంకటేష్ చైతు కలిసి చేస్తున్న వెంకీ మామ కూడా సెట్స్ పై సాగుతోంది.