కొహ్లీని సచిన్‌తో పోల్చడాన్ని సహించను: అనీల్‌ కుంబ్లే

17:23 - December 24, 2018

టీమిండియా కెప్టెన్ కోహ్లీపై మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. ఆధునిక యుగంలో ఉన్న క్రికెటర్ కోహ్లీ అని అన్నారు. కోహ్లీలోని ప్రతిభ అత్యున్నత స్థాయిలో ఉంటుందని... మ్యాచ్ లోని ఎలాంటి పరిస్థితులనైనా తన అధీనంలోకి తీసుకురాగలడని తెలిపారు. కోహ్లీకి ఎంతో భవిష్యత్తు ఉందని... ఎన్నో రికార్డులను సృష్టించగలడని తెలిపారు. ఇదిలా వుంటే...కొహ్లీని సచ్చిన్‌తో పోల్చడం మాత్రం సమర్ధించనని కుంబ్లే చెప్పారు. ఒకటి, రెండు ఘటనల ఆధారంగా సచిన్ తో పోల్చడం సరికాదని అన్నారు. సచిన్ ఉన్న సమయం, పరిస్థితులు వేరని... ఇప్పటి పరిస్థితులు వేరని చెప్పారు. ఇద్దరినీ పోల్చాల్సిన అవసరం లేదని అన్నారు.