కొత్తదనం పేరుతో తలా..తోకా లేకుండా సినిమా తీశారు

10:59 - October 30, 2018

వీరభోగ వసంత రాయలు అనే పేరుతో ముందుగా ఒక సినిమా అనౌన్స్ చేసి.. దాని కాస్టింగ్ గురించి వివరాలు వెల్లడించినపుడు ఇదేదో భలే వెరైటీ సినిమాలా ఉందే అనుకున్నారంతా. కల్ట్ ఈజ్ రైజింగ్’ అంటూ దీని క్యాప్షన్ చూసి ఇదొక కల్ట్ మూవీ అవుతుందేమో అని కూడా అనుకున్నారు. దీని టీజర్.. ట్రైలర్ చూసి సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఐతే ప్రోమోల మీద పెట్టిన శ్రద్ధలో కాస్త కూడా సినిమా మీద పెట్టలేదని.. బొమ్మ పడ్డాకే తెలిసింది. కొత్తదనం పేరుతో తలా తోకా లేకుండా సినిమా తీసి జనాల మీదికి వదిలేశారు. సినిమా ఫలితం మీద అతి నమ్మకంతో మూడు రోజుల ముందే యుఎస్ లో ప్రిమియర్లు వేయడం పెద్ద దెబ్బే కొట్టింది. ‘వీర భోగ వసంత రాయలు’కు ముందే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. జనాలు ఎంత తక్కువ అంచనాలకు వెళ్లినా నిరాశ తప్పలేదు. ఈ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేవు. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ తర్వాత టాక్ దారుణంగా ఉండటంతో రిలీజ్ చేసిన తక్కువ థియేటర్లలో కూడా జనాలు లేరు. థియేటర్ల రెంట్లు.. పబ్లిసిటీ ఖర్చులకు సరిపడా మొత్తం కూడా వసూలు కాని పరిస్థితి. వీకెండ్లోనే నిలవలేకపోయిన ఈ చిత్రం.. ఇక ఆ తర్వాత మరీ నామమాత్రంగా నడుస్తోంది.