కేసీఆర్‌ సోనియాను కోరిన కోరిక వింటే!...

13:11 - December 13, 2018

డిసెంబర్‌ 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి మధ్యే జరిగింది. కూటమిని చిత్తు చేసిన గులాబీ పార్టీ రెండో సారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే...టీఆర్‌ఎస్‌ అధినేత అయిన కేసీఆర్‌...కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒక కోరిక కోరారట. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే కాంగ్రెస్ లో టీఆర్ ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించినట్లు గతంలో వార్తలొచ్చాయి. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ తాజాగా స్పందించారు. సోనియా ముందు తాను ఆ ప్రతిపాదన పెట్టిన సంగతి వాస్తవమేనన్నారు. టీఆర్ ఎస్ ను విలీనం చేస్తే తనను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలని సోనియాను కోరినట్లు తెలిపారు. తన వినతికి ఆమె నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదని వెల్లడించారు.అంటే పదవి ఇస్తే కాంగ్రెస్‌లో కలిపేసేవారేననమాట!. మరి నేను తెలంగాణ కోసం అది చేశా...ఇది చేశా, టీఆర్‌ఎస్‌ వల్లే తెలంగాణ వచ్చింది, అని చెబుతున్న మాటలన్నీ...ఒట్టిమాటలేనా?...అంతేకదా మరి. దీన్ని బట్టి అర్ధమయ్యేదేమిటంటే...పదవి రాక కేసీఆర్‌ సారు ఈ దోవ పట్టారన్నమాట! అని వార్తలు వస్తున్నాయి. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు టీఆర్ ఎస్ బుధవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో కేసీఆర్ ను తమ ఫ్లోర్ లీడర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గులాబీ ఎమ్మెల్యేలు. అనంతరం మీడియాతో కేసీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.