కేసీఆర్‌ ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు: తమ్మినేని

10:36 - December 1, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోలింగ్‌ డేట్‌ దగ్గర పడుతుంది. పట్టుమని వారం కూడా లేదు. ఈ నేపథ్యంలో పార్టీల వారు వాగ్దానాల మీద వాగ్దానాలు ఇస్తూ....రోజుకు ఆరేడు సభలలో మాట్లాడుతూ ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం రాష్ట్ర ప్రజలను మళ్లీ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఓట్లడగడం సిగ్గుచేటని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. చంద్రబాబును తిట్టడంపైనే కేసీఆర్‌ దృష్టి పెట్టారని  ఆయన విమర్శించారు. శనివారం తమ్మినేని వీరభద్రం గారు మీడియాతో మాట్లాడుతూ...గెలిపించకుంటే రెస్ట్‌ తీసుకుంటాననే వారు ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. మహిళా బిల్లును కాంగ్రెస్‌, బీజేపీలు పట్టించుకోలేదన్నారు. పెట్టుబడిదారుల చేతుల్లో కాంగ్రెస్‌, బీజేపీ కీలుబొమ్మలన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో విధానపరంగా లేవని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.