కేసీఆర్‌ నన్ను దారుణంగా మోసం చేశారు

13:13 - October 13, 2018

ప్రజా సేవ చేసుకుంటూ ప్రజల్లో ఉంటున్న తనను గుర్తించిన కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌, అల్లుడు హరీష్‌రావు, వినోద్‌కుమార్‌లు నావద్దకు పంపించి భూపాలపల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తానని నమ్మబలికారన్నారు. పట్టుబట్టి నన్ను పార్టీలోనికి తీసుకొచ్చి సీటు ఇవ్వకుండా దారుణంగా మోసం చేశారని టీఆర్‌ఎస్‌ రెబల్‌ నాయకుడు, స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఆయన రోడ్‌షో నిర్వహించగా అనూహ్యస్పందన వచ్చింది. మండలంలోని చింతకుంటరామయ్యపల్లి, క్రోసూర్‌పల్లి, చింతల్లపల్లి, వెంకట్రావుపల్లి (సీ) గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నియోజకవర్గంలో ఇంతవరకు సాగిన అవినీతి పాలనను ఇక ప్రజలు బొందపెట్టాలన్నారు. ఇంతకాలం అసమర్థులు నియోజకవర్గాన్ని పాలించి ప్రజల బతుకులతో ఆడుకున్నారని ఆయ న విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలను ముగ్గురు కొడుకులతో కలిసి స్పీకర్‌ లూటీ చేయించారన్నారు.