కేరళలో ' సర్కార్‌ ' ని దాటేసిన ' 2.ఓ '

12:15 - November 29, 2018

రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా తెరకెక్కిన '2.ఓ' ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళలో 458 స్క్రీన్లలో విడుదలైన '2.ఓ' కొత్త రికార్డును నమోదు చేసింది. 3డీ ఎఫెక్ట్స్ .. 4డీ సౌండింగ్ సినిమా కావడంతో, అక్కడివాళ్లు ఈ సినిమా చూడటానికి విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారట. ' 2.ఓ ' రిలీజ్‌కు ముందు  కేరళలో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఇతర భాషా చిత్రంగా 'సర్కార్' పేరుతో రికార్డు వుంది. ఇటీవల ఈ సినిమా అక్కడ 412 స్క్రీన్లలో విడుదలై ఈ రికార్డును దక్కించుకుంది. ఈ సినిమా ఈ రికార్డును సొంతం చేసుకుని ఎన్నో రోజులు కాకముందే, '2.ఓ' ఆ రికార్డును చెరిపేసింది. అంతేకాదు... ఇంతవరకూ శంకర్ చేసిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందనీ, ఓపెనింగ్స్ విషయంలోను సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.