కులమతాలకు అతీతంగా ప్రజలిచ్చిన తీర్పే...బిగ్‌బాస్‌ 2 విన్నర్‌: కోన వెంకట్‌

11:20 - October 1, 2018

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నిన్న రాత్రి 9 గంటలకు (ఆదివారం)ముగిసింది. అందరూ అనుకున్న విధంగానే నిజాయితీ, పట్టుదల వున్న దగ్గరే విజయం వరించింది. కౌశల్‌కు బిగ్‌బాస్‌ 2 టైటిల్‌ రావడంతో ఎన్నో లక్షల మందికి ఆనందాన్ని పంచింది. దీని పై స్పందిస్తూ కోణ వెంకట్‌ ట్విట్‌ చేశారు.

కులమతాలకతీతంగా ప్రజలు కౌశల్ వెంట నిలిచారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.'' నిజాయితీకి ప్రజలిచ్చిన రియాక్షన్‌కు ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి వెంట పనికిరాని కుల, మతం, ప్రాంత బేధం లేకుండా ఎప్పుడూ ప్రజలు నిలబడతారనే విషయాన్ని ఇది నిరూపిస్తోంది. ఇంతటి సపోర్ట్‌కి అతను అర్హుడే. సందేహం లేదు... బిగ్‌బాస్ 2 గెలుపు కౌశల్ ఆర్మీదే '' అని కోన వెంకట్ ట్వీట్ చేశారు.