కార్తీ సెన్సేషనల్‌ మూవీకి సీక్వెల్‌ వస్తుందట!

12:07 - November 27, 2018

దర్శకుడు సెల్వ రాఘవన్  ఒక సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడట. సెల్వరాఘవన్ తెరకెక్కించిన చిత్రాలలో 'యుగానికి ఒక్కడు' ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. కార్తీ కెరియర్ ఆరంభంలో వచ్చిన సినిమా ఇది. అయినా ఒక ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు కార్తీకి స్టార్ డమ్ వచ్చింది కనుక, ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే మరింతగా ఆదరణ పొందుతుందనే నమ్మకంతో సెల్వరాఘవన్ వున్నాడట. చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. హిట్ చిత్రాలకి సీక్వెల్స్ రావడం చాలాకాలం నుంచి జరుగుతున్నదే. 'రోబో' సినిమాకి సీక్వెల్ గా '2.ఓ'ను రూపొందించిన శంకర్, ఆ తరువాత కూడా గతంలో తాను చేసిన హిట్ చిత్రాలకి వరుసగా సీక్వెల్స్ తీసుకొచ్చే ఆలోచనలో వున్నాడు. ఈ నేపథ్యంలోనే  దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా ఈ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట!. అంటే త్వరలోనే ' యుగానికి ఒక్కడు ' సీక్వెల్‌ పట్టాలెక్కబోతుందన్నమాట.