కారులో రూ.5 కోట్లు...ఎవరివి?

11:45 - December 4, 2018

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రోజులు కాస్తా గంటలవుతున్నాయి. దీంతో డబ్బుల పంపిణీలు ఎక్కడునుంచి ఎక్కడకు మారుతున్నాయో ..లెక్కలేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో కారులో రూ.5 కోట్లు దొరికాయి. నిజమండీ...వివరాల్లోకి వెలితే...తాజాగా జనగామా జిల్లాలో 5 కోట్ల రూపాయలు కారులో పట్టుబడడం కలకలం రేపింది. పెంబర్తి చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ నగదు పట్టుబడింది. అర్ధరాత్రి 1.30 నుంచి 2.00 గంటల మధ్య హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న స్విఫ్ట్ కారులో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు. కారు లోపల వెనుక డిక్కీలో మొదట చెక్ చేసిన పోలీసులకు కరెన్సీ కనిపించలేదు. కానీ అనుమానం వచ్చి కారు వెనుక సీటు కింద తనిఖీ చేయగా.. కరెన్సీ కట్టలు కనిపించాయి. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు కర్సెనీని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లెక్కించగా రూ.5 కోట్లుగా లెక్క తేలింది. ఈ డబ్బు ఎవరిది.? ఎవరు తరలిస్తున్నారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు