కాజల్‌కు... కొండచిలువతో కొత్త చిక్కులు

12:34 - October 8, 2018

టాలివుడ్‌ అందాల బామ మిత్రవిందకు ఇప్పుడు కొండచిలువతో కొత్త చిక్కులు వచ్చాయి. కొండచిలువను మెడలో వేసుకుని ఫొటోలకు ఫోజులివ్వడాన్ని జంతుహక్కుల కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఒక సెలబ్రిటీగా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని కాజల్ ప్రోత్సహిస్తుందని విమర్శిస్తున్నారు. గతంలో పెటా నిర్వహించిన యాంటీ సర్కస్ క్యాంపెయిన్‌లో పాలుపంచుకున్న కాజలేనా ఇలా చేసిందంటూ ఆనాటి వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సెలబ్రిటీలు ఇలాంటి వ్యవహారాల్లో కాస్త ఆలోచించి వ్యవహరించాలని సూచిస్తున్నారు యానిమల్ రైట్స్ కార్యకర్తలు. కాజల్ ప్రస్తుతం తేజ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగానే కాజల్ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా తీసిన వీడియోకు '  ఇదొక గొప్ప అనుభూతి ' అని క్యాప్షన్ పెట్టి కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.