కాంగ్రెస్‌లోకి ప్రజాగాయకుడు గద్దర్‌

10:57 - October 12, 2018

ప్రజాగాయకుడు గద్దర్‌ ఈరోజు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌తో హస్తం కలపనున్నారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో గద్దర్‌ కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేత మధుయాస్కీతో కలిసి గద్దర్‌ ఢిల్లీకి వెల్లినట్లు తెలుస్తుంది. నిన్నటి వరకూ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానన్న గద్దర్‌ ఈరోజు కాంగ్రెస్‌లో కలుస్తున్నారు. అయితే గజ్వేల్‌ నుండి పోటీచేస్తున్న కేసీఆర్‌కు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో వుంటానన్న గద్దర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ తరుపున పోటీ ఇవ్వనున్నారు.