కాంగ్రెస్‌లోకి పోయిన బండ్ల ఆశ..నిరాశయిపాయే!

11:30 - November 23, 2018

 ‘బండ్ల అనే నేను’ అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేసి వైరల్ అయిన బండ్లకు కాంగ్రెస్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. సీటు కోసం చేరితే‘హ్యాండి’చ్చింది. ఆ దెబ్బతో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ లో చేరిన బండ్ల గణేష్ ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. కాంగ్రెస్ సీటు వస్తుందని ఎన్నో ప్రగల్బాలు పలికిన ఈయన్ను ఇప్పుడు టీవీ చానెల్స్ అన్ని కూర్చుండబెట్టి మరీ ఓదారుస్తున్నాయి. ఏమైందీ మీసీటు.. కాంగ్రెస్ లో చేరి మోసపోయారా అని అడుగుతున్నాయి.. దానికి మింగలేక.. కక్కలేక కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా వుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా...బండ్ల బ్యాంకులకు 100కోట్లు ఎకనామం పెట్టినట్లుగా ఒక టీవీ జర్నలిస్టు ఆ విషియాన్ని ఇప్పుడే వెలుగులోకి తెచ్చారు.  ముందు అప్పులు లేవని దబాయించిన బండ్ల ఆ తర్వాత తనకు 47 కోట్లకు పైగా అప్పు ఉందని చెప్పుకొచ్చాడు. అదీ మా అన్నయ్య పేరు మీద ఉందని.. 10 నెలల్లో ఒక నెల ఎన్పీ పెడుతూ తాము కట్టలేకపోయేది నిజమేనని ఒప్పుకున్నాడు. అంతామాత్రానా తాము బ్యాంకులకు ఎగొట్టడం లేదని.. తమ 200 కోట్ల ఆస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టామని బండ్ల వివరణ ఇచ్చాడు.  ఇలా బండ్ల గుట్టు తవ్వినకొద్దీ ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..