కలుద్దాం అంటున్న దేవరకొండ

12:22 - September 28, 2018

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా ' నోటా '. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ రావటంలో సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్‌ను చిత్ర బృందం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 30న విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని ఏ+ కన్వెన్షన్ సెంటర్‌లో, అక్టోబర్ 1న హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం‌లో ఈ మీటింగ్స్ జరుగున్నట్లు విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. '' వస్తున్నాను.. కలుద్దాం''  అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో ఆమెది జ‌ర్న‌లిస్ట్ పాత్ర.  ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ' నోటా ' విడుద‌ల కానుంది.