కమర్షియల్‌ సినిమాలంటే అవన్నీ కామన్‌ అంటున్న అను...

11:53 - October 29, 2018

టాలీవుడ్ లో ఒక చిన్న చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అయినా కూడా అనూహ్యంగా అను ఎమాన్యూల్ వరుసగా మంచి ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది. హీరోయిన్స్ మొదటి సినిమా ఫ్లాప్ అయితే వారి కెరీర్ లో నిలదొక్కుకోవడం చాలా అంటే చాలా కష్టం. కాని వరుసగా రెండు పెద్ద ఫ్లాప్ లు పడ్డా కూడా అనుకు మంచి ఆఫర్లు వచ్చాయి వస్తూనే ఉన్నాయి. ఇటీవలే శైలజా రెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అను ఎమాన్యూల్ తన ప్రతి సినిమాలో కూడా స్కిన్ షోతో ముద్దు సీన్ తో రెచ్చి పోతున్న ఈ అమ్మడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నా పాత్రలకు మంచి పేరు దక్కింది. నేను చేసిన సినిమాల్లో నా నటన నచ్చడం వల్లే నాకు మళ్లీ మళ్లీ ఆఫర్లు వస్తున్నట్లుగా పేర్కొంది.  ఇక ముద్దు సీన్స్ అందాల ప్రదర్శణ విషయంలో కూడా కవరింగ్ చేసుకుంటూ.. కమర్షియల్ సినిమాలు అంటే అలాంటివి కామన్ కథ డిమాండ్ మేరకు స్కిన్ షో ముద్దు సీన్స్ చేస్తున్నట్లుగా అను చెప్పుకొచ్చింది.  వరుసగా ఫ్లాప్ ల నుండి చాలా నేర్చుకున్న నేను కొత్త సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.  నా సినిమాల్లో ముద్దు సీన్స్ సందర్బానుసారంగా ఉంటాయి తప్ప బలవంతంగా జొప్పించినట్లుగా ఉండవని అను పేర్కొంది. మొత్తానికి తన ముద్దు సీన్స్ ను స్కిన్ షోను సమర్ధించుకుంది.