కన్ఫ్యూషన్‌లో సమంత

16:35 - August 21, 2018

రిలీజ్ డేట్  అనేది సినిమా ఫేట్ ను నిర్ణయించే  కీలక అంశాల్లో ముఖ్యమైనది. అయితే ఇది అన్ని సార్లు అందరికీ అనుకూలంగా జరగదు. మరికొందరికి అనుకూలంగా మారుతుంది.  'గీత గోవిందం' సక్సెస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ అల్లు అరవింద్ గారి రిలీజ్ డేట్ ప్లానింగ్ తమ సినిమాకు ప్లస్ అయిందని చెప్పిన విషయం తెలిసిందే.ఇప్పుడు సమంతా తాజా చిత్రం 'U టర్న్' కు అనుకోకుండా వేరే చిత్రం వల్ల ఇబ్బంది వచ్చింది. 'U- టర్న్' సినిమా  నిర్మాతలు  సెప్టెంబర్ 13 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ.. కేరళ వరదల వల్ల పోస్ట్ - ప్రొడక్షన్ జాప్యం అవుతోందని అందువల్ల ఆగష్టు 31 న విడుదల కావలసిన నాగ చైతన్య మూవీ 'శైలజారెడ్డి అల్లుడు' ను వాయిదా వేశామని నిన్న చైతు ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. డేట్‌ చెప్పలేదు కానీ సెప్టెంబరు మొదటి వారం కానీ, రెండో వారం కానీ నాగ చైతన్య మూవీ ' శైలజారెడ్డి అల్లుడు ' ని రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారంట. ఒకవేళ రెండో వారం అయితే మాత్రం సమంతా సినిమా తన భర్త చైతు చిత్రం తో పోటీ పడాల్సి ఉంటుంది. 'U- టర్న్' సినిమాను  సెప్టెంబర్ చివరలో విడుదల చేద్దామంటే మామగారి 'దేవదాస్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి మామ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది.  దీంతో సామ్ ఫుల్ కన్ఫ్యూషన్ లో పడిందట. శైలజారెడ్డి ఒక్క చైతుకే కాదు సమంతా కు కూడా సమస్యగా మారిందన్న మాట. కాస్త అటు ఇటు అయితే ఏకంగా అక్కినేని నాగార్జున సినిమాకే ఎసరు పెట్టేలా ఉంది.